- Telugu News Photo Gallery Cinema photos Fans are waiting for movie updates on occasion of jr ntr birthday
JR NTR: వాటిపైనే ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మరి తారక్ కోరిక నెరవేరుస్తాడా ??
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. రెండు భారీ చిత్రాలు సెట్స్ మీద ఉండటం మరో రెండు మూడు సినిమాలు డిష్కషన్స్‌లో ఉండటంతో బిగ్ అప్‌డేట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికను తీర్చేందుకు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు..? ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్.
Updated on: May 06, 2025 | 6:43 PM

ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్. ప్రజెంట్ తారక్ సినిమాలేవి థియేటర్లలో లేకపోయినా... సెట్స్ మీద ఉన్న సినిమాల అప్‌డేట్స్‌ను థియెట్రికల్ రేంజ్‌లో సక్సెస్ చేసేలా ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు.

అందుకే బిగ్ అప్‌డేట్స్ కావాలంటూ మేకర్స్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వార్ 2 వర్క్ ఫినిష్ చేసిన తారక్, ప్రశాంత్ నీల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల నుంచే మేజర్ అప్‌డేట్స్ రానున్నాయన్నది ఫిలిం నగర్ టాక్.

ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రానుందన్న న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. వార్ 2 వర్క్ కూడా పూర్తయ్యింది కాబట్టి, ఈ మూవీ టీమ్ కూడా మేజర్ అప్‌డేట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ఎన్టీఆర్ లుక్ రివీల్ చేయటంతో పాటు వీడియో గ్లింప్స్ రానుందన్నది బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. తారక్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

సెట్స్ మీద ఉన్న సినిమాల నుంచే కాదు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే దేవర 2 టీమ్ నుంచి కూడా ఏదైన సర్‌ప్రైజ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ న్యూస్ వైరల్ కావటంతో తారక్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.




