- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine has been excelling in the industry for 20 years? She is Hansika
చిన్నవయసులో హీరోయిన్.. 20ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్.. కానీ ఇప్పుడు ఇలా
చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే హీరోయిన్స్ గా అడుగు పెట్టారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందరికన్నా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారిపోయింది.
Updated on: Jul 08, 2025 | 1:28 PM

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే హీరోయిన్స్ గా అడుగు పెట్టారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందరికన్నా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారిపోయింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

అంతే కాదు తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఆ అమ్మడు. ఆహా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కలలు కనేలా చేసింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?అందంలో అప్సరస, ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఉన్న హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరంటే..

పైన ఉన్న హీరోయిన్ ఓ పాలరాతి శిల్పం.. చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఇంతకూ ఆమె మరెవరో కాదు హన్సిక మోత్వానీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. దేశముదురు సినిమా తర్వాత కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది.

కాగా హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో రాజస్థాన్ జైపూర్‌లో వివాహం జరిగింది. సొహైల్ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. కాగా హన్సిక ఆస్తులు దాదాపు రూ. 120కోట్లకు పైనే అని తెలుస్తుంది.




