- Telugu News Photo Gallery Cinema photos Do you know who is this girl beside Sreeja Konidela She is famous businessman nimmagadda prasad daughter swathi
Sreeja Konidela: చిరు తనయ శ్రీజతో ఉన్న ఈమె ఎవరో తెల్సా..? ఒక ప్రముఖ వ్యక్తి కుమార్తె…
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కొణిదెల శ్రీజ నెట్టింట యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన పిల్లల లేటెస్ట్ ఫొటోలతో పాటు… తనకు సంబంధించిన అప్డేట్స్, ఒపెనియన్స్‌ను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ప్రజంట్ శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుండి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Updated on: Apr 29, 2023 | 9:42 PM

కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న శ్రీజ పెట్టే ప్రతి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇటీవలి కాలంలో ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది. తాజాగా శ్రీజ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.

‘నా జీవితంలోకి పంపినందుకు ఆ యూనివర్స్‌కు థాంక్స్’ అంటూ ఎమోషనల్ గా స్పందించింది శ్రీజ. విషయం ఏంటంటే.. శ్రీజ ఆ పోస్ట్ తన ఫ్రెండ్ స్వాతి నిమ్మగడ్డ గురించి పెట్టింది. వీరిద్దరూ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.

ఇటీవల స్వాతి నిమ్మగడ్డ బర్త్ డే గ్రాండ్‌గా వెళ్లింది శ్రీజ.అక్కడ స్వాతి నిమ్మగడ్డతో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. స్వాతి.. ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె. ఆయన్ను మాట్రిక్స్ ప్రసాద్ అని కూడా అంటారు.

నిమ్మగడ్డ ప్రసాద్.. చిరంజీవి, నాగార్జున కుటుంబాలకు చాలా సన్నిహితంగా ఉంటారు. వీరంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే స్వాతి బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది శ్రీజ.

కాగా స్వాతి విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆమె ఇక్కడికి వచ్చినా.. శ్రీజ అక్కడికి వెళ్లినా.. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తారు.





























