- Telugu News Photo Gallery Cinema photos Directors who show their power not only behind the screen but also on screen
Film News: తెర వెనక మాత్రమే కాదు.. తెరపై కూడా సత్తా చాటుతున్న దర్శకులు..
కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు.. ఆ కెమెరా ముందుకు వచ్చి నటించడం తెలియదా..? వాళ్లు తలుచుకుంటే ఏ నటులు వాళ్ల ముందు నిలబడతారు చెప్పండి..? మన దర్శకులు ఇదే చేస్తున్నారు. ఓ వైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. మరి రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా..?
Updated on: Feb 20, 2024 | 4:21 PM

కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు.. ఆ కెమెరా ముందుకు వచ్చి నటించడం తెలియదా..? వాళ్లు తలుచుకుంటే ఏ నటులు వాళ్ల ముందు నిలబడతారు చెప్పండి..? మన దర్శకులు ఇదే చేస్తున్నారు. ఓ వైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు యాక్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. మరి రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్స్ ఎవరో చూద్దామా..?

తరుణ్ భాస్కర్.. ఇండస్ట్రీకి ఈయన ఎంట్రీ ఇచ్చింది దర్శకుడిగా.. కానీ ఇప్పుడు ఈయన ఓ బిజీ ఆర్టిస్ట్. కారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేస్తున్నారు. అదేంటంటే.. ఫేస్ వ్యాల్యూ ఉంటేనే సినిమాలకు ఆడియన్స్ వస్తున్నారు.. అందుకే నటించడం మొదలుపెట్టానంటూ ఆన్సర్ ఇచ్చారు తరుణ్.

సముద్రఖని సైతం దర్శకుడిగా కంటే నటుడిగానే బిజీ అయ్యారు. గతేడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో బ్రో సినిమా తెరకెక్కించిన సముద్రఖని.. నటుడిగానూ ఏడాదికి కనీసం 10 సినిమాలకు పైగానే నటించారు. తాజాగా కమెడియన్ ధన్‌రాజ్ దర్శకత్వంలో రామం రాఘవంలో నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల కథతో ఈ సినిమా వస్తుంది. విమానం ఫేమ్ శివ ప్రసాద్ యానాల దీనికి కథ, మాటలు అందిస్తున్నారు.

కొన్నేళ్లుగా మెగాఫోన్ పక్కనబెట్టిన ఎస్‌జే సూర్య.. పూర్తిస్థాయి నటుడిగా మారిపోయారు. తమిళంలో ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారీయన. నాని సరిపోదా శనివారంలోనూ కీ రోల్ చేస్తున్నారు. మార్క్ ఆంటోనీతో సూర్య రేంజ్ మరింత పెరిగింది.

వీళ్లే కాదు.. శ్రీకాంత్ అడ్డాల, వెంకటేష్ మహా లాంటి దర్శకులు సైతం నటులుగా బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన పెద్ద కాపు 1 చిత్రంలో ఓ పాత్రలో నటించి మెప్పించారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.