- Telugu News Photo Gallery Cinema photos Director Puri Jagannath Special Focus on Ram Pothineni Look and Double iSmart Movie Telugu Heroes Photos
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ పై పూరీ జగన్నాథ్ సస్పెన్స్.! ఇప్పుడు కూడా రిస్క్ తప్పదా.?
సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమా సెట్స్‌పై ఉంటే.. సౌండింగ్ మామూలుగా ఉండదు. ప్రతీ 10, 15 రోజులకో అప్‌డేట్ ఇస్తుంటారాయన. ఎందుకో తెలియదు కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో మాత్రం ప్లాన్ మార్చారు పూరీ. సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ముచ్చట్లేంటి..? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది.? లైగర్ ఫలితం ప్రభావమో ఏమో కానీ పూరీ జగన్నాథ్‌లో చాలా గట్టి మార్పులే కనిపిస్తున్నాయి.
Updated on: Apr 06, 2024 | 10:05 PM

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాగానే రామ్ ఏం చేస్తారనే మాట ఎప్పటికప్పుడు చర్చల్లోకి వస్తోంది. గౌతమ్ వాసుదేవమీనన్‌తో ఓ సినిమా ఉందంటూ వార్తలున్నాయి. దాంతో పాటు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరక్టర్ మహేష్ బాబుకి కాల్షీట్ ఇచ్చారనే మాటలూ ఉన్నాయి.

ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. ముంబైలో ఇటీవల షెడ్యూల్ కంప్లీట్ చేశారు రామ్. రీసెంట్ రిలీజ్ స్కంథ నిరాశపరచడంతో డబుల్ ఇస్మార్ట్ మీద డబుల్ హోప్స్ పెట్టుకున్నారు రామ్.

మరీ ముఖ్యంగా తన సినిమా గురించి చాలా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. ఇదివరకు అడక్కపోయినా అప్‌డేట్స్ ఇచ్చే పూరీ ఇప్పుడు మాత్రం అడిగినా ఒక్క ముచ్చట కూడా చెప్పట్లేదు.

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ డీటైల్స్ అన్నీ గోప్యంగానే ఉంటున్నాయి. నిజానికి డబుల్ ఇస్మార్ట్ సినిమాను ముందు మార్చి 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో.. జూన్ 14కి మార్చారు.

కానీ డేట్ మారిన తర్వాత కూడా ఇప్పటి వరకు షూట్ అప్‌డేట్స్ ఏం రాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెండు పాటలు, ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ మిగిలి ఉన్నాయని తెలుస్తుంది.

డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ చేయబోయే సినిమాలంటూ ఒకటికి రెండు ప్రాజెక్టులు వైరల్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు రామ్ కెరీర్‌లో.

డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ మీద పూరి జగన్నాథ్ కెరీర్ ఎంత డిపెండ్ అయి ఉందో తెలియదు కానీ, రామ్ కి మాత్రం ఈ సినిమా సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్.




