- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya Busy With thandel movie and Dhootha 2 Web Series in Tollywood Telugu Heroes Photos
Naga Chaitanya: ఇటు సినిమాలు.. అటు డిజిటల్లో బిజీ బిజీగా మారిన నాగ చైతన్య.!
వెబ్ సిరీస్‌లు చేయడం అనేదే మన హీరోల కాన్సెప్ట్ కాదు.. ఏదో చిన్న హీరోలు డిజిటల్ వైపు వెళ్తుంటారేమో కానీ మెయిన్ స్ట్రీమ్ హీరోలైతే వెబ్ సిరీస్‌ల వైపు చూసిందే లేదు. ఈ ట్రెండ్‌కు నాగ చైతన్య ఫస్ట్ టైమ్ తెర తీసారు. మరి ఇకపై కూడా ఈయన ఇదే దారిలో వెళ్లనున్నారా..? దూత 2 త్వరలోనే మొదలు కానుందా..? అది మొదలైతే ఒప్పుకున్న సినిమాల సంగతేంటి.? మన హీరోలు సినిమాలు తప్ప వెబ్ సిరీస్‌ల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు.
Updated on: Apr 06, 2024 | 9:51 PM

తాజాగా చందూ మొండేటి, నాగ చైతన్య తండేల్ కోసం భారీ ప్రయోగమే చేయబోతున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూకు సక్సెస్ లేదు. బంగార్రాజు హిట్టైనా అందులో నాగార్జున ఉన్నారు. సోలో హీరోగా నటించిన థ్యాంక్యూ, కస్టడీ దారుణంగా బోల్తా కొట్టాయి.

చైతూ మార్కెట్ 40 కోట్ల లోపే ఉన్నా.. తండేల్ బడ్జెట్ మాత్రం 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలస, గుజరాత్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేసారు మేకర్స్.

బాలీవుడ్‌లో అంటే స్టార్ హీరోలు కూడా డిజిటల్‌లోకి వస్తున్నారు కానీ మన దగ్గర ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. ఉన్నంతలో మొదటి అడుగు దూత సిరీస్‌తో నాగ చైతన్య వేసారు. అది సూపర్ సక్సెస్ అయింది.

త్వరలోనే దూత 2 కూడా ప్లాన్ చేస్తున్నారు విక్రమ్ కే కుమార్. చైతూ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. అక్టోబర్‌లో తండేల్ విడుదల కానుంది.

దీని తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతున్నారు. గతంలో ఒక లైలా కోసం..లో కలిసి నటించారు ఈ జోడీ.

వరస సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ వైపు కూడా కన్నేసారు నాగ చైతన్య. దూత 2 సిరీస్ త్వరలోనే మొదలు కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు విక్రమ్.

సీజన్ 1 పెద్ద హిట్ అవ్వడంతో.. సీజన్ 2ను ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దూత 2 కూడా సక్సెస్ అయితే.. మరికొందరు హీరోల చూపులు వెబ్ సిరీస్‌ల వైపు వెళ్ళడం ఖాయం.




