- Telugu News Photo Gallery Cinema photos Director Prasanth varma Emotional on Teja sajja hanuman Movie played in 100 days in 25 theaters Telugu Heroes Photos
Hanuman @ 100 days: ఈ రోజుల్లో 100 రోజులు.. అది 25 థియేటర్స్ లో.. హనుమాన్ పెద్ద రికార్డే.
ఏ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల నడుమ చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అందుకుంది హనుమాన్ మూవీ. తాజాగా ఈ మూవీ 100 రోజుల క్లబ్‌లోకి చేరింది. అది కూడా 25 సెంటర్లలో వంద రోజులు ఆడటం అంటే చిన్న విషయం కాదు. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ పెద్ద హీరోల చిత్రాలను తలదన్నేలా ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టింది. తేజ సజ్జా హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్రలో డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Updated on: Apr 24, 2024 | 2:17 PM

ఏ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల నడుమ చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అందుకుంది హనుమాన్ మూవీ. తాజాగా ఈ మూవీ 100 రోజుల క్లబ్‌లోకి చేరింది.

అది కూడా 25 సెంటర్లలో వంద రోజులు ఆడటం అంటే చిన్న విషయం కాదు. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ పెద్ద హీరోల చిత్రాలను తలదన్నేలా ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టింది.

చిన్నగా మొదలై స్పాన్ పెంచుకుంటూ పోతుంటే ఆ కిక్కే వేరప్పా అని అంటున్నారు హనుమాన్ మేకర్స్. ఈ సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా మొదలై ప్రభంజనం సృష్టించింది హనుమాన్ సినిమా.

ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ ఆనంద సమయంలో మీరు చూపుతున్న ప్రేమతో నా హృదయం నిండిపోయింది.

హనుమాన్ వంద రోజుల వేడుకలను థియేటర్లలో జరుపుకోవడం నేను జీవితాంతం ఆరాధించే క్షణం. ఈ రోజుల్లో వంద రోజుల పాటు ఒక సినిమా ఆడటం చాలా కష్టంతో కూడుకున్నది.

అలాంటిది హనుమాన్‌కు దక్కిన ఈ గౌరవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మాలో ఇంతటి సంతోషానికి కారణమైన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ఎల్లవేళలా అపూర్వమైన మద్దతునిచ్చిన మీడియా మిత్రులకు, నా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.




