- Telugu News Photo Gallery Cinema photos Director Gautham Menon reacts on Chiyaan Vikram Dhruva Nakshatram movie release postponed details Telugu Heroes Photos
Dhruva Nakshtram: ఎంతో బాధపడ్డానన్న గౌతమ్ మీనన్.! ఆ బాధలో కొన్ని రోజులు ఎక్కడి వెళ్లలేదు కూడా..
స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు ఓ సినిమా నిద్ర పట్టుకుండా చేస్తోంది. ఎంతో ఇష్టపడి ఓ టాప్ స్టార్‌తో చేసిన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతుండటంతో గౌతమ్ ఫీల్ అవుతున్నారు. ఏడేళ్లుగా కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పటికైనా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తా అన్నారు. కాక కాక, ఎన్నై అరిందాల్, రాఘవన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో గౌతమ్ మీనన్ స్టార్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం.
Updated on: Feb 29, 2024 | 9:03 PM

స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు ఓ సినిమా నిద్ర పట్టుకుండా చేస్తోంది. ఎంతో ఇష్టపడి ఓ టాప్ స్టార్‌తో చేసిన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతుండటంతో గౌతమ్ ఫీల్ అవుతున్నారు.

ఏడేళ్లుగా కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పటికైనా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తా అన్నారు. కాక కాక, ఎన్నై అరిందాల్, రాఘవన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో గౌతమ్ మీనన్ స్టార్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం.

హీరోగా విక్రమ్ స్కై హైలో ఉన్న టైమ్‌లో మొదలైన ఈ సినిమా బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది. 2015లోనే ప్రీ ప్రొడక్షన్ మొదలైనా.. 2017 వరకు సినిమా పట్టాలెక్కలేదు.

షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత కూడా వరుస ఇబ్బందులతో వాయిదా పడుతోంది. విక్రమ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమాను అమెరికాతో పాటు బల్గేరియా, అబుదాబి, జార్జియా, టర్కీ, ఇస్తాంబుల్ లాంటి దేశాల్లో చిత్రీకరించారు.

2019 లోనే షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని ఎనౌన్స్ చేశారు. కానీ ఆ తరువాత గౌతమ్ మీనన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో పడటంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.

ఈ మధ్య సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ప్రమోషన్ కూడా చేశారు. కానీ లాస్ట్ మినిట్‌లో మరోసారి వాయిదా పడింది. ఈ పరిస్థితులపై స్పందించిన దర్శకుడు గౌతమ్ మీనన్, ధృవ నక్షత్రం వాయిదా పడటం తనను ఎంతో బాధించింది అన్నారు.

ఆ బాధలో కొన్ని రోజులు ఎక్కడి వెళ్లలేదు, ఏం రాయలేదన్నారు గౌతమ్ మీనన్. ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద స్పై సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో ధృవ నక్షత్రంకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

మరి ఇన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పటికి ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.




