ఫస్ట్ నుంచి ఉద్యోగాలు చేయకూడదు... ఏదో ఒక వృత్తి చేయాలనే ఉద్దేశం ఉండేదట లోకేష్‌కి. అయితే, ఆర్థికపరిస్థితుల కారణంగా వ్యాపారం చేయడం కుదరలేదట. ఆ తర్వాతే తనకు సినిమాల మీద ఎక్స్ పోజర్ పెరిగిందని అంటారు లోకేష్. తన సొంతూరిలో ఉన్నప్పుడు predator, commando, rocky, Rambo తరహా సినిమాలు చూసేవారట. కానీ చెన్నైకి వచ్చిన తర్వాత లోకేష్ సినిమాను చూసే దృక్పథమే మారిపోయింది. ఆయనతో పాటు మేన్షన్‌లో ఉన్నవారు కొత్త కొత్త సినిమాల పేర్లు చెప్పేవారట. scorseses filmography, tarantino, R rated films వంటివన్నీ చూడటం వారి వల్లనేనని గుర్తుచేసుకుంటారు ఈ కెప్టెన్.