National Awards: ఢిల్లీలో రెపరెపలాడిన తెలుగు సినిమా జెండా.. తెలుగు చిత్రాలపై అవార్డుల వర్షం..
ఢిల్లీ తెలుగు సినిమా జెండా రెపరెపలాడింది. ఒక్కటి రెండూ కాదు.. ఏకంగా అరడజన్‌కు పైగా అవార్డుల్లో సత్తా చూపించిన మన సినిమా గొప్పతనం రాష్ట్రపతి భవన్‌లో కనిపించింది. అల్లు అర్జున్ నుంచి మొదలు పెట్టి రాజమౌళి, దేవీ శ్రీ ప్రసాద్ సహా అవార్డులు సాధించిన అందరూ.. రాష్ట్రపతి చేతుల మీదుగా వాటిని స్వీకరించారు. ఆ ఈవెంట్‌పై స్పెషల్ స్టోరీ.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.