ఈ రోజుల్లో ఏ సినిమాకైనా ఐడియల్ రన్ టైం అంటే రెండున్నర గంటలు. దాన్ని మించి సినిమా చేయడానికి నిర్మాతలు, దర్శకులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. హీరోలైతే అంత లెంత్ ఎందుకు అని మొహం మీద అడిగేస్తున్నారు. సినిమా చాలా బాగున్నా కూడా ప్రేక్షకులకు అంత ఓపిక ఉంటుందా అనే ఆలోచనలు వస్తున్నాయి.