- Telugu News Photo Gallery Cinema photos Chance for Thalapathy Vijay to prove he is number 1 at box office with Leo movie
Leo: విజయ్ నెంబర్ 1 అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ !!
తమిళనాడులో నెంబర్ వన్ హీరో ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రజనీకాంత్ ఉన్నంత వరకు తమిళ ఇండస్ట్రీలో ఆయనను మించిన హీరో రాడు.. రాలేడు కూడా. దాదాపు 4 దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీని ఆయన మకుటం లేని మహారాజులా ఏలుతున్నాడు. ఈ మధ్య కాలంలో కొన్ని ఫ్లాపులు వచ్చినా కూడా రజనీకాంత్ మార్కెట్ ఇంత కూడా తగ్గలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా చూపించాడు.
Updated on: Oct 18, 2023 | 1:30 PM

నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 650 కోట్లకు పైగా వసూలు చేసి రజినీకాంత్ ఆల్వేస్ నెంబర్ వన్ అని నిరూపించింది. అయితే రజిని ఫామ్ లో లేని ఈ పదేళ్లలో విజయ్ చాలా ఎదిగాడు. ఆయన మార్కెట్ ఏకంగా పదింతలు పెరిగింది. ఒకప్పుడు 50 కోట్లు వసూలు చేయడానికి నానా తంటాలు పడిన విజయ్ సినిమాలు.. ఇప్పుడు ఏకంగా 400 కోట్లు కూడా వసూలు చేస్తున్నాయి.

యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా 200 నుంచి 300 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి అంటే విజయ్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాంతో తమిళనాడులో విజయ్ నెంబర్వన్ హీరో అంటూ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒప్పుకున్నారు. ఆయన సినిమాలకు కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి లెక్కల పరంగా చూస్తే నెంబర్ వన్ హీరో విజయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ బయ్యర్లు కన్ఫర్మ్ చేశారు.

ఇలాంటి సమయంలోనే జైలర్ హిట్ కావడంతో రజనీకాంత్ మళ్లీ రేస్ లోకి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజయ్. ఆల్రెడీ సంక్రాంతికి వారసుడుగా వచ్చి 300 కోట్లకు పైగా వసూలు చేశాడు ఈయన. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో లియో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 215 కోట్లు జరిగింది. తమిళనాడులో హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే. ఇంకా చెప్పాలంటే జైలర్ సినిమా బిజినెస్ 125 కోట్లు జరిగితే.. దానికి 90 కోట్లు అదనంగా లియో బిజినెస్ జరిగింది. దీన్ని బట్టి విజయ్ రేంజ్ కళ్ళ ముందు కనిపిస్తోంది. రేపు సినిమా హిట్ అయితే కచ్చితంగా జైలర్ రికార్డులను కూడా లియో తుడిచిపెడుతుందని దళపతి ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఒకవేళ ఇదే జరిగితే తమిళనాడులో నెంబర్ వన్ రేస్ ఇంకా ఆసక్తికరంగా జరుగుతుంది. ఎందుకంటే వెంకట్ ప్రభు సినిమా తర్వాత రాజకీయాల కోసం రెండేళ్లు బ్రేక్ తీసుకోబోతున్నాడు విజయ్. ఇదే సమయంలో రజనీకాంత్ వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు.

ఇప్పటికే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఈయన.. నెక్స్ట్ లొకేషన్ కనకరాజ్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు కూడా 2025 లోపే విడుదల కానున్నాయి. అవి కానీ హిట్ అయ్యాయి అంటే రజిని రేంజ్ మళ్లీ పెరగడం ఖాయం.