- Telugu News Photo Gallery Cinema photos Confirmed! Trisha Krishnan Reunites With Ajith Kumar For The Fifth Time For Vidamuyarchi
Trisha Krishnan Movie: త్రిషకు మరో క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ హీరో సరసన..!
కొందరు హీరోయిన్స్ సిల్ స్క్రీన్‌పై ఇలా తళుక్కుమని మెరిసి.. అలా ఒకట్రెండు ఏళ్లకే తెరమరుగైపోతారు. ఇంకొందరు తమ ట్యాలెంటెతో కొన్నేళ్లు నెట్టుకొచ్చినా.. ఐదేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే మహా పెద్ద విషయం. అయితే కొందరు మాత్రమే హీరోలతో పోటీపడుతూ దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. అలాంటి వారిలో త్రిష ఒకరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తమిళ పొన్ను త్రిష రెండు దశాబ్ధాలుగా అటు తమిళ్.. ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నిరాటకంగా కెరీర్ కొనసాగిస్తున్నారు.
Updated on: Sep 12, 2023 | 5:47 PM

కొందరు హీరోయిన్స్ సిల్ స్క్రీన్‌పై ఇలా తళుక్కుమని మెరిసి.. అలా ఒకట్రెండు ఏళ్లకే తెరమరుగైపోతారు. ఇంకొందరు తమ ట్యాలెంటెతో కొన్నేళ్లు నెట్టుకొచ్చినా.. ఐదేళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే మహా పెద్ద విషయం.

అయితే కొందరు మాత్రమే హీరోలతో పోటీపడుతూ దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. అలాంటి వారిలో త్రిష ఒకరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.

తమిళ పొన్ను త్రిష రెండు దశాబ్ధాలుగా అటు తమిళ్.. ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నిరాటకంగా కెరీర్ కొనసాగిస్తున్నారు. 1999లో తమిళ్‌లో జోడి చిత్రం ద్వారా త్రిష సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చారు. ‘నీ మనసు నాకు తెలుసు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ‘వర్షం’ మూవీ త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చింది.

చిరంజీవి నెక్స్ట్ మూవీలో త్రిషను తీసుకోవచ్చని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆమె మరో క్రేజీ ఆఫర్ కొట్టేశారు. స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న ‘విడాముయర్చి’ మూవీలో త్రిష హీరోయిన్‌గా ఎంపికయ్యింది. త్రిష, అజిత్ కాంబినేషన్‌లో ఇది ఐదో సినిమా. గతంలో వారిద్దరి కాంబినేషన్‌లో యన్నై అరిందాల్, మన్గాత, జై, కిరీటం సినిమాలు వచ్చాయి.

లైకా ప్రొడైక్షన్స్ నిర్మించనున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. ఈ మూవీలో సంజయ్ దత్, అర్జున్ దాస్ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు.సెప్టెంబర్ చివరి వారంలో అబు దాబీలో ఈ మూవీ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు మేకర్స్.

ప్రస్తుతం దళపతి విజయ్ సరసన లియో మూవీలో త్రిష నటిస్తోంది. విజయ్, త్రిష కాంబినేషన్‌లోనూ గతంలో పలు సినిమాలు వచ్చాయి.వరుస మూవీల్లో నటిస్తూ 40 ఏళ్లలోనూ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది త్రిష. 20 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా ఉన్న త్రిష తన ఫ్యాన్ బేస్‌ను కూడా భారీగానే పెంచుకుంది.





























