మిస్టర్ రణ్‌వీర్ అండ్ మిసెస్ రణ్‌వీర్ మధ్య కాంపిటీషన్..
నువ్వా నేనా అని పెట్టుకున్న పోటీలో నేనే.. నేనే అంటూ ఫస్ట్ ప్లేస్ కొట్టేయబోతున్నారు రణ్‌వీర్ సింగ్. ఇంతకీ నువ్వా? నేనా ? అనే పోటీ ఎవరి మధ్య జరిగింది అంటారా? మిస్టర్ రణ్‌వీర్ అండ్ మిసెస్ రణ్‌వీర్ మధ్య. ఈ పోటీలో ఒక స్టెప్పు ముందుకేసేస్తున్నారు రణ్‌వీర్ సింగ్. ఇంతకీ ఏ విషయంలో జరిగింది ఈ కాంపిటిషన్.. చూసేద్దాం పదండి....
Updated on: Oct 02, 2024 | 8:13 PM

నువ్వా నేనా అని పెట్టుకున్న పోటీలో నేనే.. నేనే అంటూ ఫస్ట్ ప్లేస్ కొట్టేయబోతున్నారు రణ్‌వీర్ సింగ్. ఇంతకీ నువ్వా? నేనా ? అనే పోటీ ఎవరి మధ్య జరిగింది అంటారా? మిస్టర్ రణ్‌వీర్ అండ్ మిసెస్ రణ్‌వీర్ మధ్య. ఈ పోటీలో ఒక స్టెప్పు ముందుకేసేస్తున్నారు రణ్‌వీర్ సింగ్. ఇంతకీ ఏ విషయంలో జరిగింది ఈ కాంపిటిషన్.. చూసేద్దాం పదండి....

ఈ మధ్యనే పండంటి పాపకు జన్మనిచ్చారు దీపిక పదుకోన్. ఆమె డెలివరీ అయినప్పటి నుంచీ రణ్‌వీర్ కూడా ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లడం లేదు. పాపాయితోనే సమయం గడుపుతున్నారు ఈ దంపతులు. అయితే మేకర్స్ అడుగుతుండటంతో నవంబర్ నుంచీ కాల్షీట్లు ఇచ్చేయడానికి రెడీ అయ్యారట మిస్టర్ రణ్‌వీర్.

ఆదిత్య ధర్ మూవీ ధనుర్దార్ కోసం నవంబర్‌లో థాయ్‌ల్యాండ్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు రణ్‌వీర్. అంతలోనే సింగం అగైన్ ప్రమోషన్లకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సో, దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నారు

గతేడాది రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీతో మంచి హిట్ అందుకున్నారు రణ్‌వీర్. ఆ తర్వాత సౌత్ కెప్టెన్లతో సినిమాలు చేస్తారనే టాక్ గట్టిగా వినిపించంది. ప్రశాంత్ వర్మ, శంకర్ దర్శకత్వంలో సినిమాలుంటాయని అనుకున్నా, ప్రస్తుతానికి ఆయన నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

రణ్‌వీర్ షూటింగులతో బిజీ అయినా, మరికొన్నాళ్ల పాటు దీపిక మాత్రం పాప కోసం సమయాన్ని కేటాయించడానికి ఫిక్సయిపోయారు. ఆమె రీ ఎంట్రీలో నేరుగా కల్కి సీక్వెల్ సెట్స్ మీదకే వస్తారనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది ఆల్రెడీ ఫైటర్, కల్కి రిలీజులున్నాయి ఆమె ఖాతాలో. సింగం అగైన్‌లోనూ ఆమె అప్పియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు.