Chiranjeevi: స్పీడు చూడతరమా అంటున్న మెగాస్టార్.. కాన్సెప్ట్ కుదిరిందా
సొగసు చూడతరమా అనేది పాత మాట... స్పీడు చూడతరమా అనేది ట్రెండ్‌లో ఉన్న వర్డ్. నాకు పాత పదాలతో పనేం ఉంది... ట్రెండ్‌లో ఉండటానికే ఇష్టపడతా అని అంటున్నారు మెగాస్టార్. స్పీడు చూడతరమా అనే పదానికి పేటెంట్ తీసుకునే పనిలో ఉన్నారు మిస్టర్ చిరు.
Updated on: Jul 26, 2024 | 12:57 PM

సొగసు చూడతరమా అనేది పాత మాట... స్పీడు చూడతరమా అనేది ట్రెండ్‌లో ఉన్న వర్డ్. నాకు పాత పదాలతో పనేం ఉంది... ట్రెండ్‌లో ఉండటానికే ఇష్టపడతా అని అంటున్నారు మెగాస్టార్. స్పీడు చూడతరమా అనే పదానికి పేటెంట్ తీసుకునే పనిలో ఉన్నారు మిస్టర్ చిరు.

విశ్వంభర సినిమాను మొన్న మొన్ననే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తోంది. అప్పుడే పూర్తయ్యే స్టేజ్‌లో ఉందట మూవీ. దీపావళిలోపు చకచకా ఈ సినిమా షూటింగ్ పనులు కంప్లీట్ చేసేసి లుక్ మార్చేయాలని ఫిక్సయ్యారు చిరు. భోళా శంకర్ ఫ్లా ప్‌ను మర్చిపోయి, హిట్ సౌండ్ వినాలని తహతహలాడుతున్నారు.

2025 సంక్రాంతికి భారీ హిట్ కొట్టాలని పక్కా ప్లాన్‌తో మూవ్ అవుతున్నారు కెప్టెన్ వశిష్ట. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందించిన బింబిసార హిట్.. జస్ట్ అలా ఊరికే వచ్చేయలేదని ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఎలాగైనా ద్వితీయవిఘ్నం రాకుండా చూసుకోవడానికి రెడీ అవుతున్నారు.

దీపావళి కంప్లీట్ కాగానే కొత్త సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టాలన్నది మెగాస్టార్ ప్లాన్. మోహన్‌రాజా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌లోపు సినిమాను రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు మోహన్‌రాజా. 2025లో బాస్ పార్టీకి మెగా ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చన్నమాట.

అయితే మోహన్‌రాజా తెరకెక్కించే సినిమా గాడ్‌ఫాదర్‌కి ప్రీక్వెలా? లేకుంటే సోషల్ డ్రామాతో ప్రిపేర్ చేసిన కొత్త కథా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మెగా కాంపౌండ్ నుంచి అఫిషియల్‌గా క్లారిటీ వచ్చే వరకు గాడ్‌ఫాదర్‌కి సంబంధించిన ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం లేదు.




