- Telugu News Photo Gallery Cinema photos Chhaava Movie Box office Collection latest update on 02 03 2025
Chhaava: బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకుంటున్న ఛావా
ఒక్కసారి సినిమా ఆడియన్స్‌లోకి వెళ్లిన తర్వాత.. దాన్ని ఆపడం అనేది అంత ఈజీ కాదు. యానిమల్, పుష్ప 2 లాంటి సినిమాల వసూళ్ళే దీనికి నిదర్శనం. తాజాగా మరో సినిమా కూడా ఇలాంటి రికార్డులనే క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం కాదు.. వసూళ్లతో వణికించేస్తుంది ఆ సినిమా. ఆ సంచలనమేంటో ఈ పాటికే అర్థమైంది కదా..!
Updated on: Mar 02, 2025 | 2:59 PM

Chhaava (1)

విడుదలైన 10వ రోజు కూడా దూకుడు చూపించింది ఛావా. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సెకండ్ వీకెండ్ 109 కోట్ల నెట్ వసూలు చేసింది ఛావా. అంటే రిలీజ్ అయిన.. 8,9,10వ రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవి. 128 కోట్లతో పుష్ప 2 ఈ లిస్టులో టాప్‌లో ఉంది.

ఇండియన్ ఇండస్ట్రీలో సెకండ్ వీకెండ్ 100 కోట్లు దాటిన సినిమాలు రెండు మాత్రమే. అవే పుష్ప 2 అండ్ ఛావా. నిజానికి ఫిబ్రవరి 23 ఆదివారం ఇండో పాక్ మ్యాచ్ ఉంది కాబట్టి కచ్చితంగా ఛావా వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారంతా. కానీ 41 కోట్ల నెట్ వసూలు చేసి దుమ్ము దులిపేసింది ఛావా. 10 రోజుల తర్వాత ఈ చిత్ర దూకుడు తగ్గట్లేదు.

ఇప్పటికే ఇండియాలో 370 కోట్లు.. ఓవర్సీస్‌లో 70 కోట్లు.. ఓవరాల్‌గా 10 రోజుల్లోనే 440 కోట్లు వసూలు చేసింది ఛావా. ఈ సినిమా దూకుడు చూస్తుంటే 700 కోట్లు ఖాయంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో అయితే ఛావా దెబ్బకు ఏ రికార్డు మిగిలేలా కనిపించట్లేదు. మార్చి 28న సికిందర్ వచ్చే వరకు ఛావాకు తిరుగులేదు.

సెకండ్ వీకెండ్ రూ.109 కోట్ల నెట్ వసూలు చేసిన ఛావా.. రూ.128 కోట్లతో టాప్‌లో ఉన్న పుష్ప 2.. సెకండ్ వీకెండ్ 100 కోట్లు దాటిన సినిమాలు రెండే.. 10వ రోజు 41 కోట్ల నెట్ వసూలు చేసిన ఛావా.. ఇండియాలో 370 కోట్లు.. ఓవర్సీస్‌లో 70 కోట్లు.. ఓవరాల్‌గా 10 రోజుల్లోనే 440 కోట్ల కలెక్షన్స్.




