Rajeev Rayala |
Updated on: Jun 17, 2022 | 9:33 PM
చాందిని చౌదరి ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీ అవుతోంది. వెబ్ సిరీస్ లతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ యమ బిజీగా గడిపేస్తోంది.
చాందిని నటించిన 'కలర్ ఫొటో' ఆహా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.
ప్రస్తుతం టాలెంటెడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ 'సమ్మతమే'.
ఈ సినిమాలో పబ్ కల్చర్ కు అలవాటు పడిన అమ్మాయిగా చాందిని చౌదరి కనిపిస్తోంది.
ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించనుంది చాందిని. దాంతో ఈ అమ్మడి ఆశాలన్నీ ఈ సినిమా పైనే ..
మరి ఈ సినిమాతో అయినా ఈ వైజాగ్ బ్యూటీకి కాలం కలిసివస్తుందేమో చూడాలి.