- Telugu News Photo Gallery Cinema photos Bobby directed Nandamuri Balakrishna NBK 109 getting tremendous hype even before starting shooting
NBK 109: షూటింగ్ కు ముందే NBK 109పై భారీ హైప్.. షూటింగ్ ఎప్పుడంటే ??
బాలయ్య, బాబీ సినిమా ఇంకా మొదలవ్వక ముందే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బ్యాక్ డ్రాప్ తెలిసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. మా హీరోకు వరసగా నాలుగో హిట్ పక్కా అంటూ సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇంతకీ ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్న ఆ నేపథ్యమేంటి..? అసలు NBK 109 మొదలయ్యేదెప్పుడు..? ఇందులో హీరోయిన్ ఎవరు..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం. బాలయ్య ఫామ్ చూస్తుంటే ఎవరికైనా భయం పుడుతుంది. 60 దాటిన తర్వాత ఈయన అస్సలు ఆగట్లేదు.
Updated on: Nov 04, 2023 | 6:18 PM

బాలయ్య, బాబీ సినిమా ఇంకా మొదలవ్వక ముందే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బ్యాక్ డ్రాప్ తెలిసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. మా హీరోకు వరసగా నాలుగో హిట్ పక్కా అంటూ సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇంతకీ ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్న ఆ నేపథ్యమేంటి..? అసలు NBK 109 మొదలయ్యేదెప్పుడు..? ఇందులో హీరోయిన్ ఎవరు..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం..

బాలయ్య ఫామ్ చూస్తుంటే ఎవరికైనా భయం పుడుతుంది. 60 దాటిన తర్వాత ఈయన అస్సలు ఆగట్లేదు. ఎంచుకుంటున్న కథలు.. పని చేస్తున్న దర్శకులు.. ఆయనిస్తున్న విజయాలు అన్నీ మారిపోయాయి. ఒక్కముక్కలో బాలయ్య 2.0 వర్షన్ నడుస్తుందిపుడు. ఈ స్పీడ్‌లోనే నెక్ట్స్ బాబీతో సినిమా చేయబోతున్నారు బాలయ్య. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా ఇది.

చిరంజీవిని 20 ఏళ్లుగా ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించి థియేటర్లలో పూనకాలు పుట్టించారు బాబీ. ఇప్పుడిక బాలయ్య ఫ్యాన్స్ వంతు. పైగా NBK ఫుల్ మాస్ బ్యాటింగ్ చేస్తున్నారు. దాంతో బాబీ పని మరింత సులువు కానుంది. మాఫియా నేపథ్యంలో NBK109 రాబోతుందని తెలుస్తుంది. నవంబర్ 6న ఫైట్ సీక్వెన్సుతో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ప్రపంచానికి ఆయన తెలుసు.. కానీ ఆయన ప్రపంచమేంటో ఎవరికీ తెలియదంటూ ఫస్ట్ లుక్‌తోనే హైప్ పెంచేసారు బాబీ. 1980ల నేపథ్యంలో సాగే మాఫియా స్టోరీ ఇదని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు బాలయ్య. మరోసారి ఏజ్డ్‌గానే కనిపించబోతున్నారు. కాజల్, త్రిషలలో ఎవరో ఒకరు బాలయ్యతో నటించే అవకాశాలున్నాయి. మార్చ్ 2024లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.




