Bobby Deol: స్టార్ హీరో సినిమా అంటే బాబీ ఉండాల్సిందేనా ??
పర్ఫెక్ట్ కేరక్టర్ ఒకటి పడితే చాలు... సరిహద్దులు దాటుకుని చాన్సులు తలుపులు తట్టేస్తుంటాయి. ఇప్పుడు బాబీ డియోల్‌ని ముంచెత్తుతున్న అవకాశాలు చూసిన వారందరూ అదే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. విజయ్ సినిమాలో బాబీ డియోల్ నటిస్తారన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్. యానిమల్ సినిమాలో అబ్రార్ సాంగ్ ఎంతగా వైరల్ అయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. విలన్‌కి ఓ పాట... ఆ పాట వైరల్ కావడం రీసెంట్ టైమ్స్ లో అందరినీ ఆకట్టుకున్న విషయం ఇది.