- Telugu News Photo Gallery Cinema photos Baahubali The Epic Grand Re release and Innovative Promotion Strategy
Baahubali: రీ రిలీజ్‌లోనూ రాజమౌళి మార్క్.. పక్కా మాస్ ప్లానింగ్ మామా ఇది
బాహుబలి తొలి భాగం రిలీజ్ పదేళ్ల పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన జక్కన్న... రీ రిలీజ్ ప్రమోషన్స్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నారు.బాహుబలితో ఇండియన్ సినిమాకు కొత్త మార్కెట్స్ క్రియేట్ చేసిన రాజమౌళి, ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్‌తోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
Updated on: Jul 31, 2025 | 9:42 PM

బాహుబలి తొలి భాగం రిలీజ్ పదేళ్ల పూర్తయిన సందర్భంగా రీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన జక్కన్న... రీ రిలీజ్ ప్రమోషన్స్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నారు.

బాహుబలితో ఇండియన్ సినిమాకు కొత్త మార్కెట్స్ క్రియేట్ చేసిన రాజమౌళి, ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్‌తోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రెండు భాగాలను కలిపి ఓకే భాగంగా రిలీజ్ చేయటం అనే ప్రయోగం ఇండియన్ స్క్రీన్ మీద ఇదే తొలిసారి.

దీనికి తోడు రీ రిలీజ్ ప్రమోషన్స్‌ను కూడా స్ట్రయిట్ మూవీ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. సినిమా ప్రమోషన్ విషయంలో ఏ అవకాశాన్ని వదులుకోని జక్కన్న, తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా పోస్ట్ మీద స్పందించారు.

గతంలో బాహుబలి గెటప్ వేసుకున్న పిక్స్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు వార్నర్. వీటిలో మీకు ఏ ఫోటో నచ్చింది అంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన రాజమౌళి.. 'మీరిప్పుడు మాహిష్మతి సామ్రాజ్యానికి నిజమైన రాజులా తయారవ్వండి.

నేను ఈ కిరీటాన్ని పంపుతున్నాను' అంటూ కామెంట్ చేశారు. వార్నర్, రాజమౌళి డిస్కషన్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో బాహుబలి రీ రిలీజ్ కూడా అదే రేంజ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ కాన్వర్జేషన్ చూశాక... రీ రిలీజ్ ప్రమోషన్స్‌లోనూ రాజమౌళి తన మార్క్ చూపిస్తున్నారంటూ ప్రైజ్ చేస్తున్నారు క్రిటిక్స్.




