- Telugu News Photo Gallery Cinema photos Ashika Ranganath Latest Stunning Photos goes viral telugu movie news
Ashika Ranganath: చీరకట్టులో కన్నడ సోయగం.. కొంటెచూపులతో కవ్విస్తోన్న ఆషికా..
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై యూత్ క్రష్ గా మారిపోయింది ఆషికా రంగనాథ్. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు హృదయాలను దొచేసిన ఈ బ్యూటీ.. ఇటీవల నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇందులో వరలక్ష్మి పాత్రలో కనిపించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. వరలక్ష్మి పాత్రలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా..
Updated on: Mar 10, 2024 | 4:22 PM

కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై యూత్ క్రష్ గా మారిపోయింది ఆషికా రంగనాథ్. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు హృదయాలను దొచేసిన ఈ బ్యూటీ.. ఇటీవల నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇందులో వరలక్ష్మి పాత్రలో కనిపించింది.

కానీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. వరలక్ష్మి పాత్రలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా.. ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో సరైన గుర్తింపు మాత్రం రావడం లేదనే చెప్పాలి. తాజాగా సోషల్ మీడియా ఖాతాలో ఈ అమ్మడు షేర్ చేసిన అందమైన ఫోటోస్ వైరలవుతున్నాయి.

చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తోంది ఈ కన్నడ సోయగం. బాపుబొమ్మలా మెరిసిపోతుంది. తాజాగా ఈ ఫోటోస్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అమిగోస్ సినిమాలో ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ అనే సాంగ్ గుర్తుకు వస్తుందంటున్నారు నెటిజన్స్.

1996 ఆగస్ట్ 5న కర్ణాటకలోని తుమకూరులో జన్మించిన ఆషికా.. 2016లో క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మాస్ లీడర్, మొగులు నాగే, రాజు కన్నడ మీడియం వంటి చిత్రాల్లో నటించింది. అతి తక్కువ సమయంలోనే అక్కడ స్టార్ డమ్ అందుకుంది ఈ ముదుగుమ్మ.

ఇక ఈ తర్వాత తెలుగులో అమిగోస్ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నాగార్జున సరసన నా సామిరంగ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. అయితే ఇప్పటివరుక ఈ ముద్దుగుమ్మ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ మాత్రం రాలేదు.




