Rajeev Rayala |
Updated on: Oct 03, 2021 | 9:48 PM
ఆకాశం నీహద్దు రా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ అపర్ణ బాలమురళి.
చూడటానికి బొద్దుగా ముద్దుగా చూడచక్కని రూపంలో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ..
ప్రముఖ దర్శకురాలు “సుధా కొంగర” దర్శకత్వం వహించిన “ఆకాశం నీ హద్దురా” అనే చిత్రం ద్వారా పరిచయమైంది “మలయాళ బ్యూటీ అపర్ణ బాలమురళి”
ఈ చిత్రంలో సుందరి అలియాస్ బేబీ పాత్రలో చాలా అద్భుతంగా నటించింది అపర్ణ బాలమురళి.
కేరళలోని త్రిస్సూర్ లో అపర్ణ జన్మించింది. ఆమె తండ్రి కె.పి.బాలమురళి ఓ సంగీత దర్శకుడు. అతని వారసురాలిగా అపర్ణ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
మలయాళంలో అపర్ణ 17 కి పైగా సినిమాల్లో నటించింది. ‘ఆకాశం నీ హద్దురా' చిత్రం అపర్ణకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈమెకు తెలుగు,తమిళ,హిందీ భాషల నుండీ మంచి ఆఫర్లు వస్తున్నాయి.