- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran made interesting comments about the movie Premam
ఆ సినిమాతో నా చదువు ఆపేయాల్సి వచ్చింది.. అనుపమ ఆసక్తికర కామెంట్స్
ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఈ వయ్యారి.
Updated on: Nov 08, 2025 | 9:14 PM

ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టా్ర్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు. 2015లో ‘ప్రేమమ్’ సినిమాతో ఆమె సినీరంగుల జీవితాన్ని ప్రారంభించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారింది.

అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ అయ్యింది. మలయాళ ‘ప్రేమమ్’ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమాలో కనిపించింది కాసేపు మాత్రమే అయినప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రేమమ్ సినిమా తర్వాత అనుపమకు వరుస ఆఫర్స్ రావడంతో కాలేజీ చదువును సగంలోనే వదిలేయాల్సి వచ్చింది. అనుపమకు సినిమా అంటే చాలా ఆసక్తి ఉండేది. ఆమె ‘మణియరళియే అశోకన్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.




