- Telugu News Photo Gallery Cinema photos Another heroine in chiranjeevi vishwambhara hitlist movie going to release in may 31st
Tollywood News: విశ్వంభరలో రానున్న మరో బ్యూటీ.. మే 31న రానున్న ‘హిట్ లిస్ట్’
చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ సూపర్ ఫాస్టుగా జరుగుతుంది. త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు విశ్వంభరలో నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. చిరు జోడీ మాత్రమే త్రిషనే.ధనుష్ నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Updated on: May 27, 2024 | 8:30 PM

Vishwambhara: చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ సూపర్ ఫాస్టుగా జరుగుతుంది. త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు విశ్వంభరలో నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా.. చిరు జోడీ మాత్రమే త్రిషనే.

Raayan: ధనుష్ నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్.జె.సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ‘రాయన్’ నుంచి సందీప్ కిషన్, అపర్ణ బాలమురళిపై పిక్చరైజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ విడుదల చేసారు.

Karthi: కార్తి హీరోగా నటిస్తున్న 26వ సినిమాకు వా వథియార్ అనే టైటిల్ ఖరారు చేసారు. నలన్ కుమారస్వామి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. జపాన్ ఫ్లాప్‌తో డీలా పడిన కార్తికి ఈ చిత్ర విజయం కీలకంగా మారింది. కృతి శెట్టి ఈ చిత్రంలో కార్తికి జోడీగా నటిస్తున్నారు.

Aay: నార్నె నితిన్ హీరోగా అంజి తెరకెక్కిస్తున్న సినిమా ఆయ్..! అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రంగనాయకి అంటూ సాగే సాంగ్ విడుదల చేసారు. రామ్ మిరియాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నాయకి పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

Hitlist: తమిళ డైరెక్టర్ విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే.కార్తికేయన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో శ్రీనివాస్ గౌడ్, బెక్కం రవీందర్ హిట్ లిస్ట్ సినిమాను మే 31న విడుదల చేయబోతున్నారు.



