AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమౌళి 2.0.. టాలీవుడ్ నయా హిట్ మెషిన్.. వేరే లెవెల్ అంతే

సినిమా రిలీజ్‌ అయినప్పుడు సక్సెస్‌ కావాలని ఎవరైనా కోరుకుంటారు... కానీ, ఆల్రెడీ ఉన్న సక్సెస్‌ కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో సినిమా చేసి, దాన్ని నిలబెట్టుకుని ప్రూవ్‌ చేసుకున్నప్పుడు అసలైన మజా వస్తుంది. అలాంటి మజాని ఎంజాయ్‌ చేస్తున్నారు అనిల్‌ రావిపూడి. సక్సెస్‌ స్ట్రీక్‌ కంటిన్యూ అవుతున్నప్పుడు రెట్టింపు జోష్‌తో అడుగులు ముందుకు పడాలన్నది ఆయన ఫాలోయర్స్ మనసులో మాట.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Jan 23, 2025 | 8:45 PM

Share
గోదారి గట్టు మీద.. అంటూ రమణగోగుల వాయిస్‌ని జనాలను మరోసారి గుర్తుచేసి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్‌ గ్యారంటీ అనే స్టాంప్‌ వేసేశారు అనిల్‌ రావిపూడి. పబ్లిసిటీ విషయంలోనూ వెరైటీగా ఆలోచించి, జనాల్లోకి దూసుకుపోయారు. బేరాల్లేవమ్మా... అంటూ ఎప్పటి నుంచో మినిమమ్‌ గ్యారంటీ సినిమాలతో థియేటర్లకు ఆడియన్స్ ని పుల్‌ చేస్తూనే ఉన్నారు అనిల్‌.

1 / 5
కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచీ కమర్షియల్‌ నాడిని పట్టుకున్న డైరక్టర్‌గా పేరుంది అనిల్‌ రావిపూడికి. ఆడియన్స్  కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌, అందులో సెన్సిబుల్‌ ఎలిమెంట్‌, యూత్‌కి కావాల్సిన యాక్షన్‌, కాస్త మసాలా, దానికి తగ్గట్టు మ్యూజిక్‌ అంటూ.. అన్నిటినీ బ్యాలన్స్  చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అనిల్‌.

2 / 5
ఈ సంక్రాంతికి కూడా ఆయనకు అదే వర్కవుట్‌ అయింది. వెంకటేష్‌ కెరీర్‌లో మంచి నెంబర్లను చూసిన సినిమాగా రికార్డులు క్రియేట్‌ చేస్తోంది సంక్రాంతికి వస్తున్నాం. మహేష్ బాబు కూడా టీమ్‌ని కలిసి బెస్ట్ విషెస్‌ చెప్పేశారు.

3 / 5
సరిగ్గా ఈ టైమ్‌లోనే అనిల్‌ నెక్స్ట్ స్టెప్‌ ఎటు అనే డిస్కషన్‌ మొదలైంది. వెంకటేష్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తానని ఓపెన్‌గా చెప్పేసిన అనిల్‌.. నెక్స్ట్ బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్నారా? భగవంత్‌ కేసరిలాంటి కథతో బాలయ్యకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చేశారు అనిల్‌. మరోసారి ఈ కాంబో స్క్రీన్‌ మీదకు వస్తే చూడ్డానికి ఫ్యాన్స్ రెడీ.

4 / 5
అయితే, అంతలోపే మెగాస్టార్‌తో ఓ ప్రాజెక్ట్ ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశ్వంభర పనుల్లో ఉన్న చిరంజీవి... అనిల్‌కి ఎప్పటి నుంచి కాల్షీట్స్ ఇస్తారోననే క్యూరియాసిటీ మాత్రం సర్వత్రా కనిపిస్తోంది. రాజమౌళి తర్వాత ఆ రేంజ్‌ సక్సెస్‌ రేట్‌ ఉన్న కెప్టెన్‌గా మంచి ఫార్మ్ లో ఉన్నారు అనిల్‌. ఈ టైమ్‌లో మెగా మూవీ పడితే... వేరే లెవల్లో ఉంటుందంటున్నారు నెటిజన్లు.

5 / 5