యాంకర్ గా తనకంటూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతోన్న కామెడీ షో జబర్దస్త్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. వచ్చి రాని తెలుగుతో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను కవ్విస్తుంది రష్మీ. ఇక ఈ చిన్నది గ్లామర్ షోతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది.