- Telugu News Photo Gallery Cinema photos Jr NTR next Movie War 2 shooting update with hrithik roshan in Film Industry Telugu Heroes Photos
Jr.NTR- War 2: వార్ 2 షూటింగ్ మొదలైపోయిందా.? వార్ 2 సెట్స్ లో Jr NTR ఎప్పుడంటే.?
వార్ 2 షూటింగ్ మొదలైపోయిందా..? ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్‌ను కలిసి వెళ్లారు దర్శకుడు అయన్ ముఖర్జీ. ఈ లెక్కన దేవర 2 కంటే ముందే వార్ 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారా..? కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్, అయన్ లైన్‌లో ఉంటే ఎవరికి తారక్ డేట్స్ ఇవ్వనున్నారు..? అసలు వార్ 2 సెట్స్‌లో జూనియర్ అడుగు పెట్టేదెప్పుడు..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..
Updated on: Oct 21, 2023 | 5:52 PM

వార్ 2 షూటింగ్ మొదలైపోయిందా..? ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్‌ను కలిసి వెళ్లారు దర్శకుడు అయన్ ముఖర్జీ. ఈ లెక్కన దేవర 2 కంటే ముందే వార్ 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారా..?

కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్, అయన్ లైన్‌లో ఉంటే ఎవరికి తారక్ డేట్స్ ఇవ్వనున్నారు..? అసలు వార్ 2 సెట్స్‌లో జూనియర్ అడుగు పెట్టేదెప్పుడు..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

జూనియర్ ఎన్టీఆర్ మామూలు బిజీగా లేరిప్పుడు. 2001లో కెరీర్ మొదలుపెట్టిన తారక్.. 2018 వరకు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ వచ్చారు. కానీ అరవింద సమేత తర్వాత 2019, 2020, 2021 ఖాళీగా ఉండిపోయాయి..

అలాగే ట్రిపుల్ ఆర్ వచ్చాక.. 2023 మళ్లీ ఖాళీ. 2024లో దేవరతో రానున్నారీయన. అందుకే ఇకపై ఇలాంటి బ్రేక్స్ ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు తారక్. ఓ వైపు దేవర షూటింగ్ నడుస్తూనే ఉంది.. మరోవైపు నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతూనే ఉన్నారు.

కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ 1 షూటింగ్ నవంబర్ చివరి నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత దేవర 2 కంటిన్యూ చేస్తారా లేదంటే వార్ 2 వైపు తారక్ వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వార్ 2 షూటింగ్ స్పెయిన్‌లో ఇప్పటికే మొదలైంది.

వార్ 2 ఫస్ట్ షెడ్యూల్‌లో హృతిక్ జాయిన్ అయ్యారు. దేవర షూట్ తర్వాత ఎన్టీఆర్ కూడా జాయిన్ కానున్నారు. ఈ మధ్యే అయన్ ముఖర్జీ ఇదే విషయంపై తారక్‌ను కలిసి వెళ్లారు. డిసెంబర్ నుంచి వార్ 2 సెట్స్‌లో ఎన్టీఆర్ అడుగు పెట్టే ఛాన్స్ ఉంది.

మరోవైపు దేవర 2 షూట్ కూడా 2024 సమ్మర్‌లోపే పూర్తి కానుందని తెలుస్తుంది. ఈ రెండూ అయ్యాక.. ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి రానుంది. మరి ఒకేసారి ఇన్ని ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.




