- Telugu News Photo Gallery Cinema photos Actress Sneha most memorable happening moment in her life te;lugu cinema news
Actress Sneha: మధుర మీనాక్షి ఆలయంలోని కలశాన్ని తాకిన తొలి మహిళ స్నేహ.. ఎంతటి అదృష్టం..
తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్నేహ. ముంబైలో జన్మించి దుబాయ్ లో పెరిగింది. ఆమె అసలు పేరు సుహాసిని. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సంప్రదాయ లుక్లో కనిపిస్తూ జూనియర్ సౌందర్యగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. స్నేహ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి ఉంది. మధురై మీనాక్షి ఆలయంలోని కలశాన్ని తాకిన తొలి మహిళ స్నేహ కావడం విశేషం.
Updated on: Oct 12, 2023 | 9:00 PM

తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్నేహ. ముంబైలో జన్మించి దుబాయ్ లో పెరిగింది. ఆమె అసలు పేరు సుహాసిని. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సంప్రదాయ లుక్లో కనిపిస్తూ జూనియర్ సౌందర్యగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

స్నేహ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి ఉంది. మధురై మీనాక్షి ఆలయంలోని కలశాన్ని తాకిన తొలి మహిళ స్నేహ కావడం విశేషం.

సుసి గణేశన దర్శకత్వంలో హీరో ప్రశాంత్ సరసన స్నేహ నటించిన సినిమా విరుంభం. ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది స్నేహ.

ఈ సినిమాలో మదురైలోని మీనాక్షి అమ్మవారు ఆలయంలోని గోపురం పైన ఉన్న కలశం తాకిన దృశ్యం ఉంది. సాధారణంగా మదురై మీనాక్షి అమ్మన్ దేవాలయం గోపుర కలశాన్ని ఏ స్త్రీ తాకలేదు.

కానీ సినిమాలో ఓ సన్నివేశం కోసం స్నేహ ఆ కలశాన్ని తాకేలా ఏర్పాటు చేశారు. ఆ విధంగా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ గోపుర కలశాన్ని తొలి మహిళగా స్నేహ చరిత్ర సృష్టించింది.

సినిమాలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా దర్శకుడు స్నేహతో ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్నేహ చాలా సంతోషించింది. కలశాన్ని పట్టుకున్న తర్వాత కిందకు రాగానే గుడి పూజారి స్నేహ చాలా అదృష్టవంతురాలని, ఇంతకు ముందు ఎవరికీ లేని వరం ఆమెకు కలిగిందన్నారు.





























