- Telugu News Photo Gallery Cinema photos Actress Sai Pallavi visits Annapurna Devi Temple In Varanasi, See Photos
Sai Pallavi: కాశీ యాత్రలో సాయి పల్లవి.. అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న నేచురల్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
గార్గి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఇందులో సాయి పల్లవి నటన మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ నేచురల్ బ్యూటీ తాజాగా కాశీకి వెళ్లింది.
Updated on: Dec 23, 2024 | 3:21 PM

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో మునిగితేలుతోంది. తాజాగా కాశీకి వెళ్లిన ఆమె అక్కడి అన్నపూర్ణా దేవిని దర్శించుకుంది.

ఈ సందర్భంగా బ్లూ కలర్ సల్వార్ సూట్, దుపట్టా, మెడలో బంతిపూల హారం, చేతికి రుద్రాక్షల దండతో అమ్మవారిని దర్శించుకుంది సాయి పల్లవి.

సాయి పల్లవికి చెందిన ఓ ఫ్యాన్ క్లబ్ ఆమె కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్ గా మారాయి.

కాగా సాయి పల్లవి చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఆమె నటించిన తండేల్ త్వరలోనే రిలీజ్ కానుంది.

ఇక నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమాలో సీత పాత్రలో నటిస్తోందీ న్యాచురల్ బ్యూటీ. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు.

ఈ సినిమా తొలి భాగం 2026లో వచ్చే దీపావళికి, రెండో భాగం 2027లో వచ్చే దీపావళికి రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.





























