- Telugu News Photo Gallery Cinema photos Actress Roopa Koduvayur Latest Blue Colour Stunning Photos Goes Viral
Tollywood: అందంతో చంపేసే వయ్యారి.. నెట్టింట చెమటలు పట్టిస్తోన్న కిల్లర్ బ్యూటీ..
ఇప్పుడిప్పుడే తెలుగు సినీపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. బ్యా్క్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. మరోవైపు నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్స్ హృదయాలను దోచుకుంటుంది. అందం, అభినయంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి.
Updated on: May 03, 2025 | 1:07 PM

తెలుగు సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అచ్చ తెలుగమ్మాయిలలో రూప కొడువాయూర్ ఒకరు. అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

రూప కొడువాయూర్.. ఇప్పుడు తెలుగులో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ. 2020లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సహజ నటనతో కట్టిపడేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు సారంగపాణి జాతకం సినిమాలో కనిపించింది.

ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నటిగా మరింత గుర్తింపు తెచ్చుకుంది రూప. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ గురించి చెప్పక్కర్లేదు.

తాజాగా నీలిరంగు గ్లామర్ డ్రెస్ లో కిల్లింగ్ చూపులతో చంపేస్తుంది రూప. ఉంగరాల జుట్టు.. మత్తెక్కించే చూపులతో నెట్టింట మాయ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.




