Raashi Khanna: గ్లామర్ డోస్ పెంచేసిన రాశి ఖన్నా.. మంటలు రేపుతోందిగా..
అందాల భామ రాశి ఖన్నా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ భామ. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చూడచక్కని రూపం, ఆకట్టుకునే నటన ఉన్న రాశి టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రాశి ఖన్నా. అంతే కాదు ఈ అమ్మడు మంచి సింగర్ కూడా.