Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ బ్యూటీ శోభ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ పుణ్యమా అని మనకు పెద్దగా తెలియని వారు కూడా పాపులర్ అవుతున్నారు. ఇక ఈసీజన్ లో కూడా ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ కొత్త మొఖాలే వారిలో శోభ శెట్టి ఒకరు. పాపులర్ కార్తీక దీపం సీరియల్ చూసే వారికి ఈ అమ్మడు బాగా తెలుసు. కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్రలో నటించింది శోభ శెట్టి. అలాగే కన్నడ లో కూడా పలు సీరియల్ లో నటించింది. అదేవిధంగా అక్కడ సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉంది.