- Telugu News Photo Gallery Cinema photos Actress Nayanthara said earlier that she would not be able to attend the promotions Telugu Heroines Photos
Nayanthara: ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..
ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా అంటూ ఖైదీ నెం 150లో చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా..! ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఇదే చేస్తున్నారు నయనతార. ప్రమోషన్స్ అనేసరికి నో నో నేను రానని చెప్పే ఈ బ్యూటీ.. తనకు అవసరం అయినపుడు మాత్రం కండీషన్స్ మార్చుకుంటున్నారు. తాజాగా ప్రమోషన్స్ విషయంలో మరోసారి మాట మార్చారు నయన్. నో ప్రమోషన్స్.. ఓ సినిమాకు సైన్ చేసే ముందే నిర్మాతలకు నయనతార చెప్పే మాట ఇదే.
Updated on: Jul 04, 2024 | 9:13 PM

ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా అంటూ ఖైదీ నెం 150లో చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా..! ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఇదే చేస్తున్నారు నయనతార. ప్రమోషన్స్ అనేసరికి నో నో నేను రానని చెప్పే ఈ బ్యూటీ..

తనకు అవసరం అయినపుడు మాత్రం కండీషన్స్ మార్చుకుంటున్నారు. తాజాగా ప్రమోషన్స్ విషయంలో మరోసారి మాట మార్చారు నయన్. నో ప్రమోషన్స్.. ఓ సినిమాకు సైన్ చేసే ముందే నిర్మాతలకు నయనతార చెప్పే మాట ఇదే.

నేను ప్రమోషన్స్‌కు రాలేనంటూ ముందుగానే చెప్పినా కూడా ఆమె డేట్స్ కోసం ఎగబడుతుంటారు నిర్మాతలు. అదే నయనతారకి ఉన్న క్రేజ్. వందల కోట్ల సినిమాకు ప్రమోషన్ చేయరు కానీ తనకు కావాల్సిన వాళ్ల కోసం మాత్రం పద్దతులు పక్కనబెడుతుంటారు ఈ బ్యూటీ.

మామూలుగా అయితే మూవీ ప్రమోషన్ అనే పదమే నయన్‌కు నచ్చదు. కానీ గత కొన్నేళ్లుగా ఈమె పద్దతుల్లో మార్పు కనిపిస్తుంది. ఆ మధ్య సొంత సినిమా కనెక్ట్ కోసం బాగానే ప్రమోషన్ చేసుకున్నారు నయన్.

తాజాగా తనది కాని సినిమా ప్రమోషన్‌కు షాకిచ్చారు ఈ భామ. తన ఫ్రెండ్, దర్శకుడు విష్ణు వర్ధన్ తెరకెక్కిస్తున్న నేసిప్పాయ సినిమాకు తన వంతు సాయం చేసారు నయన్.

విష్ణు వర్ధన్ అంటే నయన్‌కు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే తమిళంలో ఆయన తెరకెక్కించిన బిల్లాతోనే స్టార్ అయ్యారు నయన్. తర్వాత కూడా ఆరంభంలో ఆఫర్ ఇచ్చారు.

ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు అడగంగానే విష్ణు సినిమాకు ప్రమోషన్ చేసారు నయనతార. అదే దయ తమపై కూడా చూపిస్తే బాగుంటుందిగా అంటున్నారు నయన్‌తో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు.




