- Telugu News Photo Gallery Cinema photos Actress Natasha Doshi Tie Knot with Businessman Manan, Shares Photos
Natasha Doshi: సీక్రెట్‌గా వివాహం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత పెళ్లి ఫొటోలు బయటకు..
టాలీవుడ్ హీరోయిన్ నటాషా దోషి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది. అయితే సుమారు నెలక్రితమే సీకెట్ర్ గా ఈ పెళ్లి జరిగింది. తాజాగా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నటాషా. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Updated on: Mar 03, 2024 | 4:14 PM

టాలీవుడ్ హీరోయిన్ నటాషా దోషి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది. అయితే సుమారు నెలక్రితమే సీకెట్ర్ గా ఈ పెళ్లి జరిగింది. తాజాగా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నటాషా.

ముంబయికి చెందిన నటాషా దోషి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. బాలకృష్ణ జై సింహా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత శ్రీకాంత్ కోతల రాయుడులో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

అయితే ఈ సినిమాలేవీ పెద్దగా క్లిక్ కాలేదు. 2020 తర్వాత సినిమాలకు దూరమైన నటాషా దోషి గతేడాది జూలైలో మనన్ షా అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది.

అయితే జనవరి 31న కుటుంబ సభ‍్యుల సమక్షంలో మనన్ షాను పెళ్లి చేసుకుంది నటాషా. అయిదే దాదాపు నెల తర్వాత ఇప్పుడు తన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. ఈ క్రమంలో అందరూ నటాషా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.




