- Telugu News Photo Gallery Cinema photos Actress Malavika Mohanan Interesting Comments On Prabhas and Raja Saab Movie
Malavika Mohanan: ప్రభాస్ సెట్‌లోకి వస్తూనే ఎనర్జీని తీసుకొస్తారు.. ‘రాజాసాబ్’ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ నటించిన తంగలాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే రాజాసాబ్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రానుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుంది.
Updated on: Aug 25, 2024 | 12:33 PM

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ నటించిన తంగలాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ మాళవిక మోహనన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే రాజాసాబ్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రానుంది.

డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది మాళవిక.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కల్కి సినిమా విడుదలకు ముందే రాజాసాబ్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని.. ప్రభాస్ సెట్‌లోకి అడుగుపెడుతూనే ఎనర్జీని తీసుకువస్తారని తెలిపింది. డార్లింగ్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని చెప్పుకొచ్చింది.

పనిని భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తుంటారని.. అందరిని ఆప్యాయంగా పలకరిస్తారని తెలిపింది. పాన్ ఇండియా హీరో అయినా ఏమాత్రం గర్వం లేదని.. పైగా రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొంటారని చెప్పుకొచ్చింది.

డార్లింగ్ పక్కన నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందని.. రాజాసాబ్ కచ్చితంగా హిట్ అవుతుందని తెలిపింది. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మాళవికతోపాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.




