- Telugu News Photo Gallery Cinema photos Actress Lahari shares her son first birthday celebrations photos
Actress Lahari: కుమారుడి ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన బుల్లితెర నటి లహరి.. ఫొటోస్ ఇదిగో
లహరి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొగలి రేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఆ తర్వాత గృహలక్ష్మీ ధారావాహికలోనూ నటించి తెలుగు జనాలకు కు బాగా చేరువైంది.
Updated on: Sep 08, 2024 | 9:45 AM

లహరి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొగలి రేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఆ తర్వాత గృహలక్ష్మీ ధారావాహికలోనూ నటించి తెలుగు జనాలకు కు బాగా చేరువైంది.

గతేడాది లహరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తన బిడ్డను చూసుకునే పనిలో బిజీ బిజీగా ఉంటుందామె.

బిడ్డ కారణంగానే గత కొంత కాలంగా ఎలాంటి సినిమాలు, సీరియల్స్ లో నటించడం లేదు లహరి. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.

గ్లామరస్ ఫొటోలు, వీడియోలు, ఫన్నీ రీల్స్, డ్యాన్స్ వీడియోలతో తన ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుందీ అందాల తార.

లహరి సొంత యూట్యూబ్ ఛానెల్‌ల్ నూ కూడా నిర్వహిస్తుంది. తాజాగా తన కుమారుడి మొదటి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు లహరి దంపతులు.

ఈ వేడుకల్లో లహరి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.