Rajeev Rayala | Edited By: Shaik Madar Saheb
Updated on: May 06, 2024 | 4:02 PM
హరితేజ .. సీరీయల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. పలు టీవీషోలో కనిపించి మెప్పించింది. మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, తాళి కట్టు శుభవేళ, శివరంజని, కన్యాదానం ఇలా పలు సీరియల్స్ లో నటించింది హరితేజ.
ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో వెండితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ సమంత పనిమనిషిగా నటించింది. అలాగే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది హరితేజ.
ఆతర్వాత ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ లో తన ఆటతో పాటు అల్లరితో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే ఆతర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
సినిమాలతో పాటు చాలా టీవీ షోలకు యాంకర్ గా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే ఉప్పుడు సోషల్ మీడియాలో హరితేజ మాములు సందడి చేయడం లేదు. ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
తాజాగా హరితేజ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రస్ లో అందాలతో కవ్విస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది. హీరోయిన్స్ లా మారి గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది హరితేజ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.