- Telugu News Photo Gallery Cinema photos Actress Faria Abdullah has done 5 movies as heroine but only 2 were hits
Tollywood : హీరోయిన్‌గా ఐదు సినిమాలు చేస్తే.. హిట్ అయినవి రెండే.. ఈ భామ ఎవరో తెలుసా..
శ్రీలీల, రష్మిక, మీనాక్షి చౌదరి.. ఇలా యంగ్ బ్యూటీస్ అందరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి కూడా.. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయ్యింది.
Updated on: Nov 30, 2024 | 1:38 PM

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని బిజీ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. ఈమధ్యటాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యంగ్ హీరోయిన్స్ వరుస సినిమాలతో రఫ్ఫాడిస్తున్నారు.

శ్రీలీల, రష్మిక, మీనాక్షి చౌదరి.. ఇలా యంగ్ బ్యూటీస్ అందరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి కూడా.. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయ్యింది.

అందం అమాయకత్వం కలబోసినా ఆమె ఎవరో గుర్తుపట్టారా .? అంత ఈజీగా ఆమెను మర్చిపోలేరు ఆడియన్స్. ఆమె మరెవరో కాదు జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి కవ్వించి నవ్వించిన ఫరియా అబ్దుల్లా.

ఈ ముద్దగుమ్మ తొలి సినిమాలో అమాయకంగా కనిపించి ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు,మత్తు వదలరా 2 సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమాల్లో రెండే హిట్స్.

హీరోయిన్ గా 5 సినిమాలు చేస్తే కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ డోస్ పెంచేసి ప్రేక్షకులను కవ్విస్తుంది ఈ వయ్యారి భామ. నెట్టింట ఓ రేంజ్ లో రచ్చ చేస్తోంది.




