- Telugu News Photo Gallery Cinema photos Actress Brigida Saga Shares Wedding Photos with Vignesh Karthik of next movie
Brigida Saga: అమ్మబాబోయ్.! అబ్బాయిలకు యంగ్ హీరోయిన్ సడెన్ హార్ట్ ఎటాక్.. ఆ డైరెక్టర్‌తో పెళ్లి.?
ఇండస్ట్రీలో పెళ్లి భజాలు మోగతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలలో చాలా మంది నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు హార్ట్ ఎటాక్ తెప్పించింది. కోలీవుడ్ హీరోయిన్ బ్రిగిడ సాగాకు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో షార్ట్ ఫిల్మ్, పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Jul 27, 2024 | 1:29 PM

ఇండస్ట్రీలో పెళ్లి భజాలు మోగతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలలో చాలా మంది నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు హార్ట్ ఎటాక్ తెప్పించింది.

కోలీవుడ్ హీరోయిన్ బ్రిగిడ సాగాకు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో షార్ట్ ఫిల్మ్, పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు మంచి క్రేజ్ ఉంది.

అయితే తాజాగా తన ఇన్ స్టాలో డైరెక్టర్ విఘ్నేశ్ కార్తీక్.. తను సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. సడన్ గా ఈ ఫోటోస్ చూసి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారేమో అని ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్.

కానీ ఇదంతా ఓ సినిమా కోసం జరిగిన షూట్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే డైరెక్టర్ విఘ్నేష్ కార్తీక్ కు పెళ్లైంది. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

మరోవైపు బ్రిగిడ సాగా తెలుగు, తమిళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పుడు దక్షిణాదిలో రాణిస్తున్న బ్రిగిడ.. ఇలా సడన్ గా పెళ్లి దుస్తుల్లో కనిపించేసరికి నిజమే అనుకున్నారు చాలా మంది. కానీ అసలు విషయం తెలిపి ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్.




