- Telugu News Photo Gallery Cinema photos Shanvi Srivastava Latest Instagram Photos Goes Viral On Social Media
అయ్యబాబోయ్.! అందాలతో గత్తరలేపుతోన్న ‘లవ్‌లీ’ మూవీ హీరోయిన్.. చూస్తే మెంటలెక్కాల్సిందే
తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ సత్తా చాటి టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న బ్యూటీలు ఎందరో ఉన్నారు.. అందులో ఒకరే శాన్వీ శ్రీవాత్సవ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Updated on: Jul 27, 2024 | 11:31 AM

తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ సత్తా చాటి టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న బ్యూటీలు ఎందరో ఉన్నారు.. అందులో ఒకరే శాన్వీ శ్రీవాత్సవ. ఈ అందాల భామ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టింది.

2012లో లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌లీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శాన్వీ శ్రీవాత్సవ. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించింది.

ఆ తర్వాత సుశాంత్ సరసన ‘అడ్డా’ సినిమాలో నటించింది. తెలుగులో శాన్వీ చివరిగా ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ అనే సినిమాల్లో కనిపించింది. ఇక కన్నడంలో ‘చంద్రలేఖ’ అనే సినిమాతో అడుగుపెట్టింది.

ఆ తర్వాత శాండిల్‌వుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది ఈ కన్నడ కస్తూరి. ‘మాస్టర్ పీస్’, ‘భలే జోడీ’, ‘సుందరంగా జానా’, ‘సహేబా’, ‘అవనే శ్రీమన్నారాయణ’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది శాన్వీ శ్రీవాత్సవ.

2014 తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించిన శాన్వీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. లవ్‌లీ సినిమా టైంలో చబ్బీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత హాట్‌గా దర్శనమిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.




