- Telugu News Photo Gallery Cinema photos Actress ayesha khan shared her latest saree photos goes viral on internet
Ayesha Khan: ఎర్ర చీరలో కుర్ర భామ.. ఆహా.. అనిపిస్తున్న అయేషా ఖాన్ ఫోటోలు
అయేషా ఖాన్ జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ముంబైకి చెందిన ఈ నటి మోడల్‌గా తన వృత్తిని మొదలుపెట్టి, ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది.బాలీవుడ్ లో ఏక్తా కపూర్ తెరకెక్కించిన డైలీ సోప్ కసౌతీ జిందగీ కేలో జూనియర్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసింది.
Updated on: Apr 19, 2025 | 1:49 PM

అయేషా ఖాన్ జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ముంబైకి చెందిన ఈ నటి మోడల్‌గా తన వృత్తిని మొదలుపెట్టి, ఆ తర్వాత నటన వైపు అడుగులు వేసింది.

బాలీవుడ్ లో ఏక్తా కపూర్ తెరకెక్కించిన డైలీ సోప్ కసౌతీ జిందగీ కేలో జూనియర్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసింది. 2019లో బాలవీర్ రిటర్న్స్ సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో నటించి గుర్తింపు పొందింది. ఆతర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

2023లో హిందీ బిగ్ బాస్ సీజన్-17లో కంటెస్టెంట్‌గా పాల్గొని విస్తృత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 2022లో ముఖచిత్రం చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది, ఇందులో మాయా ఫెర్నాండెజ్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత 2024లో ఓం భీమ్ బుష్ లో గ్లామరస్ రోల్‌తో మంచి మార్కులు అందుకుంది.

విశ్వక్ సేన్‌తో ఓ చిత్రంలో డ్యాన్స్ నంబర్‌లో కనిపించి, "మోత మోగిపోద్ది" అంటూ అభిమానులను అలరించింది. రీసెంట్ గా సన్నీడియోల్ నటించిన జాట్ మూవీలోనూ మెరిసింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఎర్ర చీరలో కొన్ని ఫోటోలను పంచుకుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.




