Anasuya Bharadwaj: కుర్రాళ్ళు జర్రా జాగ్రత్త.. మతిపోగొడుతున్న అనసూయ పోజులు..
యాంకర్ గా ఎన్నో టీవీ షోల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ నటిగాను సత్తా చాటింది. అనసూయ అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అనసూయ 2016లో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో అక్కినేని నాగార్జున సరసన నటించి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
Updated on: Apr 19, 2025 | 1:44 PM

అనసూయ భరద్వాజ్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత యాంకర్ గా రాణించింది ఈ భామ. బుల్లి తెరపై అనసూయ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

యాంకర్ గా ఎన్నో టీవీ షోల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ నటిగాను సత్తా చాటింది. అనసూయ అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అనసూయ 2016లో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో అక్కినేని నాగార్జున సరసన నటించి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరం, క్షణం చిత్రంలో ఆమె పోషించిన నెగెటివ్ పాత్ర ఆమెకు నటిగా మార్కులు కొట్టేసింది.

2018లో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర ఆమెకు భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత పుష్ప: ది రైజ్ లో దాక్షాయణి పాత్రలో నెగెటివ్ రోల్‌లో నటించి మరోసారి తన వైవిధ్యమైన నటనను ప్రదర్శించింది.

అనసూయ విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, రజాకార్, సింబా, విమానం, ప్రేమవిమానం (వెబ్ సిరీస్) వంటి వాటితో ప్రేక్షకులను అలరించింది. ఆమె కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో కూడా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.




