- Telugu News Photo Gallery Cinema photos Actress Anasuya Bharadwaj Celebrates Her Birthday In Orphanage Home, See Photos
Anasuya Bharadwaj: నచ్చేశారు మేడమ్! అనాథాశ్రమంలో అనసూయ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోస్ ఇవిగో
స్టార్ యాంకర్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ గురువారం (మే 16) తన పుట్టినరోజుని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ అనాథాశ్రమానికి తన భర్తతో కలిసి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలకు బహుమతులు ఇచ్చింది.
Updated on: May 16, 2025 | 1:28 PM

స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు

కాగా ఈ సారి అనసూయ తన పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఆమె అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది.

ఈ సందర్భంగా అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్లతో కలిసి డ్యాన్సులు కూడా వేసింది అనసూయ.

అనంతరం దీనికి సంబంధించి న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను' అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అనసూయపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'మీరిలాగే మరిన్ని మంచి పనులు చేయాలి మేడమ్' అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.




