Shah Rukh Khan: ఐఫా వేడుకలలో షారుఖ్ ఖాన్ సందడి.. ఆర్యన్ ఖాన్ కేసు రోజులను గుర్తుచేసుకున్న బాద్ షా..
ఐఫా 2024 అవార్డుల ప్రదానోత్సం వేడుకలు గత రెండు రోజులుగా అబుదాబిలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో జవాన్ సినిమాకు ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ అవార్డ్ అందుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు షారుఖ్.