- Telugu News Photo Gallery Cholesterol control Tips Follow these tips to control bad Cholesterol Telugu Health News
Cholesterol control Tips: కోలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Cholesterol control Tips: ఈ రోజుల్లో చాలామంది తిండి విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది
Updated on: Jul 18, 2022 | 2:02 PM

ఈ రోజుల్లో చాలామంది తిండి విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. దీనిని నియంత్రించడం చాలాముఖ్యం. మరి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఏది తిన్నా అది సరిగ్గా జీర్ణం కావడం చాలా ముఖ్యం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో కూడా వ్యాయామం సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగానూ ఉంచుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, ఆహారంలో పచ్చని కూరగాయలను చేర్చుకోవాలి. బ్రోకలీ, బచ్చలికూర, ఓక్రా వంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆహారంలో వివిధ రకాల పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఆపిల్, బొప్పాయి, అవకాడో, నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆరోగ్యకరమైన వంట నూనెను ఉపయోగించడం ఎంతో ఉత్తమం. హెచ్‌డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే వంట నూనెలను ఉపయోగించుకోవాలి. సోయాబీన్ నూనె, నువ్వుల నూనె, లిన్సీడ్ నూనె, ఆలివ్ నూనె లను వంటల్లో వాడుకోవాలి





























