Priyanka Chopra Birthday 2022: ‘మిస్ వరల్డ్ అవుతానని నా చిన్నతనంలో ఎప్పుడూ అనుకోలేదు’
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా పుట్టిన రోజు నేడు (జులై 18). 39 ఏళ్లు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రియంక చోప్రాకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. ప్రియాంక బర్త్‌డే సందర్భంగా కొన్ని అరుదైన ఫొటోలు మీకోసం..

1 / 5
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా ఎదుగుతానని, హాలీవుడ్‌లో అడుగులు వేస్తానని ఎప్పుడూ అనుకోలేదని తెల్పింది. ప్రియాంక చోప్రా చిన్ననాటి ఫొటో ఇది.
2 / 5
చదువు పూర్తయ్యాక ప్రియాంక చోప్రా మోడలింగ్ ప్రారంభించింది. 2000 సంవత్సరంలో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత, మిస్ వరల్డ్ పోటీలో ఇటాలియన్ బ్యూటీని ఓడించి, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
3 / 5
ప్రపంచ సుందరైన తర్వాత ప్రియాంక చోప్రా హిందీ సినిమాల వైపు మొగ్గుచూపింది. The Hero: Love Story of Spy చిత్రంతో సినీరంగంలోకి ప్రవేశించింది. ఈ చిత్రానికి గానూ ప్రియాంక ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. ఈ మువీ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది.
4 / 5
సాత్ ఖూన్ మాఫ్, బర్ఫీ వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రియాంక పేరు బాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం వరుస హాలీవుడ్ మువీ ఆఫర్లతో ప్రియంక చోప్రా జోరు చూపిస్తోంది.