- Telugu News Photo Gallery Cholesterol Control Tips: Cholesterol Can Control And Reduce Heart Attack Risk By These Yogasanas
Cholesterol Control Tips: రక్తంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే యోగాసనాలు.. క్రమంతప్పకుండా చేస్తే గుండె జబ్బులు పరార్
నేటికాలంలో చాలామంది మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి గతితప్పిన జీవనశైలి, తప్పుడు ఆహారం ప్రధాన కారణం. కొలెస్ట్రాల్‌ను మొదటి నుండి నియంత్రించకపోతే, గుండెపోటు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ప్రధానంగా రెండు రకాలు. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల సిరలు - ధమనులలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. పలితంగా రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది..
Updated on: May 16, 2024 | 12:40 PM

నేటికాలంలో చాలామంది మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి గతితప్పిన జీవనశైలి, తప్పుడు ఆహారం ప్రధాన కారణం. కొలెస్ట్రాల్‌ను మొదటి నుండి నియంత్రించకపోతే, గుండెపోటు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ప్రధానంగా రెండు రకాలు. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల సిరలు - ధమనులలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. పలితంగా రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఫలితంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి మరీ పెరిగితే వైద్యుల సలహాతో మందులు వాడాల్సి ఉంటుంది. కానీ తినడం ద్వారా మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యోగా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యోగా వంటి వ్యాయామాలు అజీర్ణం, మధుమేహం, ఎముకల సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ధనురాసనం, భుజంగాసనం, పశ్చిమోత్తాసనం వంటి కొన్ని యోగాసనాలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

భుజంగాసనం.. వెనుకభాగంలో పడుకుని, అరచేతులతో కడుపు నుంచి పైభాగాన్ని ఎత్తాలి. శరీరం భుజంగ ఆకారంలో ఉన్నందున దీనిని భుజంగాసనం అంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థను కూడా చక్కగా ఉంచుకోవచ్చు. ఈ విధంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.

పశ్చిమోత్తాసనం.. కాళ్లను ముందుకి చాచి కూర్చోవాలి. పై నుండి చేతులను నిఠారుగా ఉంచి, నెమ్మదిగా ముందుకు తీసుకొచ్చి కాలి బొటనవేళ్లను పట్టుకోవాలి. తర్వాత మోకాళ్లపై తలను ఉంచి, శరీరం పై భాగాన్ని ముందుకు వంచాలి. మోకాలు వంగకూడదు. ఇది పశ్చిమోత్తాసనం. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. తద్వారా మెరుగైన గుండె ఆరోగ్యానికి దారితీస్తుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న రోగులు దీన్ని చేయడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.

ధనురాసనం.. వెనుకవైపు పడుకుని నడుము నుంచి శరీర ముందు భాగాన్ని పైకెత్తి, కాళ్ళను వెనుకకు మడిచి వాటిని పైకి లేపి, రెండు చేతులను వెనుకకు తీసుకుని, కాలి వేళ్లను పట్టుకోవాలి. ఇది సరిగ్గా చేస్తే.. భంగిమ విల్లులా ఉంటుంది. అందుకే దీనికి ధనురాసనం అని పేరు. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఛాతీ విస్తరిస్తుంది. కండరాల ఒత్తిడి తగ్గుతుంది. ఊపిరితిత్తులకు ప్రయోజనం చేకూరుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.




