- Telugu News Photo Gallery Chicken With Coconut Milk Recipe: If you eat this healthy chicken recipe, you can lose 2 kg in a month
Weight Loss Chicken: ఈ చికెన్ రోజుకు రెండు పీస్‌లు తిన్నారంటే.. మీ బరువు నెల రోజుల్లోనే..
షుగర్, బీజీ వంటి పలు ఆరోగ్య సమస్యలకు మూల కారణం అధిక బరువు. జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంలో నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఒబేసిటీతో బాధపడుతున్నారు. శరారక శ్రమతగ్గడం, తగినంత నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, ప్రాసెస్ ఫుడ్ అధికంగా తినడం వంటి పలు కారణాల రిత్యా బరువు పెరిగిపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది మోకాలు, మెడ, భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో రోజుకు కనీసం 1 గంటపాటు చెమట పట్టడం కోసం జిమ్‌లలో ..
Updated on: Sep 21, 2023 | 12:50 PM

షుగర్, బీజీ వంటి పలు ఆరోగ్య సమస్యలకు మూల కారణం అధిక బరువు. జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంలో నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఒబేసిటీతో బాధపడుతున్నారు. శరారక శ్రమతగ్గడం, తగినంత నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, ప్రాసెస్ ఫుడ్ అధికంగా తినడం వంటి పలు కారణాల రిత్యా బరువు పెరిగిపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది మోకాలు, మెడ, భుజం నొప్పితో బాధపడుతున్నారు.

దీంతో రోజుకు కనీసం 1 గంటపాటు చెమట పట్టడం కోసం జిమ్‌లలో కసరత్తులు చేస్తున్నారు. అన్ని వయసుల వారందరికీ వ్యాయామం చేయడం అత్యవసరం అయిపోయింది. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహార ఎంపిక మరో సమస్యగా మారింది. అయితే తక్కువ కేలరీలు కలిగిన ఈ చికెన్ రిసిపిని తిన్నట్లయితే కార్బోహైడ్రేట్ల సమస్య ఉండదు. పైగా అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. త్వరగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ రెపిసీ ఎలా తయారు చేసుకోవాలంటే..

పాన్‌లో 2 స్పూన్ల నూనెను వేడి చేశాక.. దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు, బే ఆకులు వేసి వేగనివ్వాలి. అనంతరం వెల్లుల్లి, అల్లం పేస్టు, కారం వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక గిన్నె నిండా వెయ్యాలి. అన్నీ బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలి.

చికెన్‌తోపాటు బంగాళదుంపలు, క్యారెట్లు, బీన్స్, బఠానీలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పాన్‌లో కూరగాయల పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. అనంతరం ఒక కప్పు కొబ్బరి పాలు అందులో పోసుకోవాలి. రుచికి పరిపడా మిరియాల పొడి వేసుకోవాలి. అందులో కారం, పసుపు వేసుకోవల్సిన అవసరం లేదు. అనంతరం మూతపెట్టి, తక్కువ లేదా మీడియం వేడి మీద ఉడికించాలి.

15 నిమిషాల తర్వాత మూత తెరిచి అందులో కొన్ని స్వీట్ కార్న్, ఒక చిన్న కప్పు నీళ్లు కలుపుకోవాలి. గ్రేవీ చిక్కగా మారిన తర్వాత కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. అలాగే మూడు నిమ్మకాయ ఆకులను వేసి10 నిముషాలు ఆవిరి మీద ఉడికిస్తే అద్భుతమైన సువాసన వస్తుంది. రుచికరమైన వైట్ చికెన్ రెడీ అయినట్లే.




