- Telugu News Photo Gallery Chanakya Niti Due to these mistakes relationship of husband and wife can be ruined
Chanakya Niti: ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఖతమే.. చాణుక్యుడు ఏం చెప్పాడో తెలుసుకోండి..
Chanakya Niti for Relationship: ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి శాస్త్రంలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని సూచించాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Apr 23, 2022 | 8:13 AM

అబద్ధాలు - ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. అబద్ధాలు ఏవైనా సంబంధాన్ని బలహీనపరుస్తాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అది బంధానికి హాని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య నిజాయితీ ఉండటం చాలా ముఖ్యం. ఇద్దరి బంధం సత్యం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

కోపం - కోపం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. కోపం తెచ్చుకోవడం అనేది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. కోపంగా ఉన్న వ్యక్తి తాను చేస్తున్న పనిని మరచిపోతాడు. కోపంతో మాట్లాడే విషయాలు చాలా మనస్పర్థలను కలిగిస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోవడం మానుకోవాలి.

ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. దీంతోపాటు మంచి, చెడులకు అనేక అంశాలపై నీతి శాస్త్రంలో బోధించాడు. అయితే.. ఓ మనిషి కొన్ని అలవాట్లను వెంటనే మానుకోవాలని.. లేకపోతే చాలా నష్టాలు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇలా చేయడం వల్ల జీవితంలో విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు.

గోప్యత - భార్యాభర్తల మధ్య గోప్యత ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. భార్యాభర్తల వ్యక్తిగత విషయాలు మూడో వ్యక్తికి తెలియజేయడం సంబంధానికి అస్సలు మంచిది కాదు. అదే సమయంలో సంబంధాన్ని కొనసాగించడానికి అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ లోపం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని నాశనం చేస్తుంది.

ఇలాంటి విషయాల్లో తప్పులు చేస్తే భార్యభర్తల మధ్య సంబంధం ఎక్కువ కాలం ఉండదని చాణక్య పేర్కొన్నారు.




