- Telugu News Photo Gallery Cancer should be controlled with these spices, Check Here is Details in Telugu
Spices for Cancer: ఇది విన్నారా.. ఈ మసాలాలతో క్యాన్సర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
క్యాన్సర్ అనేది ప్రమాదకర వ్యాధిగా చెబుతారు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉన్నా.. బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాధి ఎక్కువగా ముదిరితే మాత్రం కంట్రోల్ చేసుకోవడం కష్టం. క్యాన్సర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఈ మసాలా పదార్థాలు చక్కగా సహాయ పడతాయి..
Updated on: Jan 23, 2025 | 12:21 PM

వంటిల్లే వైద్యశాల అని పెద్దలు ఊరికే అనలేదు. మన ఇంట్లో లభించే వాటితోనే ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా మనం వాడే మసాలా దినుసులు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మన కిచెన్‌లో లభించే మసాలాలతోనే క్యాన్సర్ మహామ్మారిని కంట్రోల్ చేసుకోవచ్చు.

ఈ మసాలా దినుసుల్లో క్యాన్సర్‌ని కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు.

ఎక్కువగా వాడే వాటిల్లో అల్లం కూడా ఒకటి. ఇందులోని కొన్ని జింజెరాల్ సమ్మేళనాలు.. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. పసుపు కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది. తరచూ తీసుకుంటూ ఉంటే.. శరీరంలో క్యాన్సర్ కణాలు వ్యాప్తిని తగ్గిస్తుంది.

పిజ్జాలు, బర్గర్లు తినేటప్పుడు వేసుకునే ఓరెగానోతో కూడా క్యాన్సర్‌ని కంట్రోల్ చేయవచ్చు. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది. వెల్లుల్లిని ఎన్నో రకాల వంటల్లో వాడతారు. ఇది కూడా క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి.

దాల్చిన చెక్కను కూడా వంటల్లో ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటారు. దాల్చిన చెక్కతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది క్యాన్సర్‌ను కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగ పడుతుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది. తల, మెడ క్యాన్సర్ రాకుండా సహాయ పడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




